Narayana CID case: ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
అయితే సీఐడీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.