ETV Bharat / city

Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా - etela rajender latest news

etela rajender, etela rajender resignation
ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా
author img

By

Published : Jun 4, 2021, 12:15 PM IST

Updated : Jun 4, 2021, 12:50 PM IST

12:13 June 04

ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్

19 ఏళ్లుగా తెరాసతో ఉన్న బంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్... శాసనసభ్యుడి పదవికీ రేపు రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్​లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. శనివారం రోజున గన్​పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత సభాపతి పోచారం శ్రీనివాస్​ను కలిసి రాజీనామా లేఖ అందించనున్నారు. త్వరలోనే భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఈటల.. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని... బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్.... ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు.

Last Updated : Jun 4, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.