ETV Bharat / city

జగన్​ అక్రమాస్తుల కేసు నుంచి పేరు తొలగించండి.. విశ్రాంత ఐఏఎస్ పిటిషన్ - hyderabad CBI special court

జగన్ అక్రమాస్తుల కేసు (Jagan Disproportionate Assets Case)తో తనకెలాంటి సంబంధం లేదంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు నుంచి తన పేరు తొలగించాలని సీబీఐ కోర్టును కోరారు.

former
విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ పిటిషన్
author img

By

Published : Jun 14, 2021, 9:41 PM IST

జగన్ అక్రమాస్తుల కేసు (Jagan Disproportionate Assets Case) నుంచి తనను తొలగించాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యుల్ (former ias samuel ) కోరారు. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో నిందితుడిగా ఉన్న శామ్యూల్.. కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారిగా విధులు నిర్వహించానని.. తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

పెన్నా గ్రూప్ సంస్థ పీఆర్ ఎనర్జీ తరఫు న్యాయవాది కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. పెన్నా సిమెంట్స్ తోపాటు అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఛార్జ్ షీట్ పై విచారణను ఈనెల 21కి కోర్టు వాయిదా వేసింది. హైకోర్టు స్టే పొడిగింపు ఉత్తర్వులను సమర్పించాలని హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. ఓబుళాపురం గనుల అక్రమాల కేసు విచారణ జరిగింది. శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది అభ్యర్థనతో విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: HARISH RAO: రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి: మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.