Double Bedroom Scheme : పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రెండు పడక గదుల ఇళ్లను విక్రయించడం, కొనడం.. రెండూ నేరమే. అమ్ముతున్నవారిపైనా, కొనేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల పట్టాల పంపిణీ రోజే ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని లబ్ధిదారులకు స్పష్టంగా చెబుతున్నారు. అయినా కేటాయించిన నెల రోజులకే నగరంలోని పలు చోట్ల డబుల్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారులు వేర్వేరు కారణాలతో విక్రయిస్తున్నారు.
ఎలా అమ్ముతున్నారంటే.. నగరంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం 2016లో మొదలైంది. ఇప్పటి వరకు 5 వేల ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది.
రెండు పడక గదుల ఇంటి పట్టాలో ఇతరుల పేరు చేర్చడం కుదరదు. అందువల్ల.. కొనుగోలుదారులు రూ.100 స్టాంపు పేపరుపై విక్రయపత్రాన్ని రాసుకుని.. పట్టాదారులు, వారసుల సంతకాలు తీసుకుంటున్నారు.
లబ్ధిదారుల సంక్షేమ సంఘాల్లోని కొందరు వ్యక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ అమ్మకాలను, కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నారు.
ఎక్కడెక్కడ కొనుగోళ్లు.. జియాగూడ, ఖైరతాబాద్, బాలానగర్ చౌరస్తాలోని చిత్తారమ్మబస్తీ, నెక్లెస్‌రోడ్డులోని అంబేడ్కర్‌నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో.
జియాగూడలో.. ఇక్కడి మురికివాడలో జి+5 పద్ధతిలో 840 ఇళ్లను నిర్మించారు. 568 ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించారు. 15 ఇళ్లు అమ్ముకున్నారు.
ఖైరతాబాద్‌లోని ఐమాక్స్‌కు ఎదురుగా.. ఇక్కడ 210 ఇళ్లను నిర్మించారు. ఇక్కడ రూ.17-20 లక్షల మధ్య విక్రయిస్తున్నారు. 10 ఇళ్లు అమ్మారు.
అమ్మేందుకు కారణాలు.. ఆర్థిక ఇబ్బందులు, పిల్లల పెళ్లిళ్లు, వ్యాపారాలు, ఇతరత్రా అవసరాలకు కొందరు లబ్ధిదారులు ఇళ్లను అమ్ముతున్నారు.
వేరే ప్రాంతంలో అప్పటికే ఇల్లు ఉండటం.
ఇరుగు పొరుగుతో సర్దుకుపోలేక.
వాతావరణం నచ్చక.
నిర్వహణ సమస్యలు, ఇతరత్రా కారణాలతో