హైదరాబాద్ గచ్చిబౌలిలోని వెస్టిన్ మైండ్‌స్పేస్ ఫైవ్‌స్టార్ హోటల్(westin hyderabad mindspace)లో ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాం డర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆహార నిల్వల్లో కనీస ప్రమాణాలు పాటించనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వంటగది పరిశుభ్రత విషయంలో యాజమాన్యం(five star hotels in hyderabad) నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడించారు. వెజ్, నాన్‌వెజ్ పదార్థాలను ఒకే చోట నిల్వ చేసినట్లు పేర్కొన్నారు.
బేకరీలో నిల్వ ఉంచిన పలు ఆహార పదార్థాల గడువు ముగిసినవిగా ఉన్నట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి పంచనామా చేశారు. ఈ వ్యవహారాన్ని నగర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ తనిఖీలో ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ - తెలంగాణ జాయింట్ డైరెక్టర్ కేఏ అరూల్ ఆనంద్, టెక్నికల్ అధికారి సాయిశివతో పాటు జీహెచ్ఎంసీ పుడ్ సేఫ్టీ(శేరిలింగంపల్లి) అధికారి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: