ETV Bharat / city

FOOD PROCESSING UNITS: పల్లెటూళ్లను పలకరించిన నూతన పద్ధతులు.. నోరూరిస్తున్న మామిడితాండ్ర - Mango Tandra Manufacturing Industry

కరోనాతో పల్లె, పట్టణం అని తేడా లేకుండా అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తీసుకునే ఆహారం గురించి  ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పరిశుభ్రతకు, స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు... పోషకాలతో కూడిన ఆహార పదార్ధాలనే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో నూతన పద్ధతులు పల్లెటూళ్లను సైతం పలకరిస్తున్నాయి. అందుకు ఏపీలోని విజయనగరంజిల్లా మామిడితాండ్ర తయారీదారులు నిదర్శనం. వీరికి విశాఖ గీతం విశ్వవిద్యాలయం అండగా నిలుస్తోంది.

Taste-hygine food making
Taste-hygine food making
author img

By

Published : Nov 7, 2021, 6:43 PM IST

నూతన పద్ధతుల్లో ఫుడ్ ప్రాసెసింగ్‌ చేస్తున్న పల్లెటూరి మహిళలు

ఏపీలోని విజయనగరం జిల్లా మహిళలు మామిడి తాండ్ర తయారీలో ఆరితేరారు. సాంప్రదాయంగా కుటీర పరిశ్రమగా కొనసాగుతున్న ఈ రంగాన్ని ఇక్కడ మహిళలు వారసత్వంగా కొనసాగిస్తున్నారు. అయితే... సాంప్రదాయ పద్ధతుల్లోనే తాండ్ర తయారు చేస్తుండటంతో కాల క్రమంలో రాబడి తగ్గిపోతోంది. ఇలాంటి వారికి విశాఖకు చెందిన గీతం వర్సిటీ అండగా నిలిచింది. మహిళలకు ఆధునిక తయారీ పద్ధతులపై శిక్షణ ఇవ్వడంతోపాటు...శుచి, రుచిగా తయారీలో మెలకువలు నేర్పుతోంది. మెరుగైన ఆహార ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా భారత ప్రభుత్వం గీతం వర్సిటీకి బయోటెక్ ప్రాజెక్ట్ మంజూరు చేసింది. అందులో భాగంగానే వర్సిటీకి చెందిన సిబ్బంది.. గ్రామీణ మహిళలకు పుడ్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు.

సుమారు రూ. 50 లక్షలతో మామిడి మ్యాంగో జ్యూస్, అరటిలో టిస్యూకల్చర్, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను గీతం వర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ విభాగాల్లో జామి మండలంలోని అలమండ గ్రామంతోపాటు చుట్టు పక్కల నిరుద్యోగ మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణలో పూర్తిస్థాయిలో నైపుణ్యం సాధించిన మహిళలు... ఆధునిక విధానంలో నవీన పరికరాలు ఉపయోగించి మామిడి తాండ్ర తయారు చేస్తున్నారు.

అంతేకాదు కొమ్ముశనగలు, పెసలు, గోధుమలు, రాగులు, కందుల మొలకలతో పొడులు తయారు చేస్తున్నారు. క్యారెట్, పాలకూర, బచ్చలకూర, బీట్ రూట్, అల్లం, ఉల్లిపాయలు, కొత్తమీర, కరివేపాకు, టమోటాతోపాటు వివిధ రకాల కూరగాయలను సోలార్ డ్రయర్‌లో ఎండబెట్టి.... వాటి నుంచి కూడా పొడులు చేస్తున్నారు. బోన్ సా మిషన్, మీట్ నైసర్, వాక్యూమ్ టంబ్లర్, వాక్యూమ్ ప్యాకింగ్ మిషన్ తదితర పరికరాల ద్వారా మాంసాన్ని ప్రాసెసింగ్ చేయటంలోనూ మహిళలు నైపుణ్యం సాధించారు.

ఈ బయోటెక్‌ ప్రాజెక్టు ద్వారా సుమారు 60 మంది గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు... ప్రాజెక్టు పర్యవేక్షకులు తెలిపారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి... స్వయం ఉపాధి వైపు పయనిస్తున్నారని వివరించారు. ఈ బయోటెక్ ప్రాజెక్టు ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్‌లో రానున్న రోజుల్లో మరిన్ని ఆహార పదార్థాల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా స్థానిక రైతులు, మహిళలకు ఉపయుక్తమైన వాటిపై దృష్టి సారించారు.

ఇదీ చూడండి: Police Humanity: లాఠీ ఝుళిపించడమే కాదు.. సహాయం చేయడమూ తెలుసు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.