కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ వల్ల... ఏపీలోని పూల రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధానంగా 8 మండలాల్లో పూలు సాగవుతాయి. ప్రస్తుతం శుభకార్యాలేవీ లేక.... పూల సేకరణ, తరలింపు, హోల్‌సేల్ కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏటా ఈ సీజన్‌లో రోజుకు టన్నుకు పైగా పూల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు ఆ ఊసేలేదని రైతులు వాపోతున్నారు.
పూలు కొనేవారు లేక... రైతులు వాటిని కోయడం మానేస్తున్నారు. అవి అలాగే వడలిపోయి పొలాల్లోనే రాలిపోతున్నాయి. పూలతోటల కోసం వెచ్చించిన పెట్టుబడి తిరిగొచ్చే పరిస్థితి లేదని... రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ రంగానికి, ఉత్పత్తులు విక్రయానికి, కూలీల తరలింపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా... క్షేత్ర స్థాయిలో కార్యచరణకు నోచుకోవట్లేదు. ఉత్పత్తుల అమ్మకానికి రైతులకు లాక్ డౌన్ ఆంక్షల నుంచి సడలింపు లభిస్తున్నా... వాటి కొనుగోలుదారులు, విక్రయదారులకు ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో ప్రధాన పంటలు సాగు చేసే రైతులతో పాటు.. పూలసాగుదార్లకు ఇబ్బందులు, నష్టాలు తప్పటం లేదు.
ఇవీ చదవండి: