ETV Bharat / city

'బాధితులకు ఇవ్వకుండా నాయకులే దోచుకుంటున్నారు' - వరదసాయం కోసం బంజారాహిల్స్​ వాసుల ఆందోళన

హైదరాబాద్​ బంజారాహిల్స్‌కు చెందిన వరద బాధితులు మంత్రుల నివాస ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబాలను వదిలేసి... అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్యకర్తలు చెప్పిన వారికే సాయం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'బాధితులకు ఇవ్వకుండా నాయకులే దోచుకుంటున్నారు'

author img

By

Published : Nov 12, 2020, 3:38 PM IST

వరద సాయం అందించడంలో నాయకులు తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ... హైదరాబాద్​ బంజారాహిల్స్‌కు చెందిన బాధితులు మంత్రుల నివాస ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్-10 లోని సింగాడికుంట, జహీరానగర్ తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలను వదిలేసి... అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.550 కోట్ల ప్రజాధనాన్ని... కార్యకర్తలు చెప్పిన వారికే సాయం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను పోలీస్​ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ బంజారాహిల్స్​లో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.