భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వచ్చేనెల నుంచి ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు సర్వీసులు నడపడానికి ట్రూజెట్ సంస్థ సిద్ధంగా ఉంది. నిర్మాణ పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు భరత్‌రెడ్డి తెలిపారు.
ఏపీలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చాయని, ఫైనాన్షియల్ బిడ్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కర్నూలు విమానాశ్రయ భూములను వినియోగించుకున్నందుకు ఏపీఏడీసీఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చదవండి : మరోసారి భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు