South Central Railway News: దక్షిణ మధ్య రైల్వే ఇతర జోన్ల కంటే అధికంగా రైల్వే 67వ వారోత్సవాల్లో ఐదు ‘అఖిల భారత పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్’లను సొంతం చేసుకుంది. రైల్వే భద్రత, సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ, సివిల్ ఇంజినీరింగ్, స్టోర్స్, సివిల్ ఇంజినీరింగ్(కన్‌స్ట్రక్షన్) విభాగాల్లో గతేడాది ఉత్తమ పనితీరుకు ఈ గుర్తింపు లభించింది. భువనేశ్వర్‌లోని రైల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ద.మ.రైల్వే జీఎం(ఇన్‌ఛార్జి) అరుణ్‌కుమార్ జైన్‌తో పాటు జోన్‌లోని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు రైల్వేశాఖ మంత్రి నుంచి ఈ పురస్కారాలను అందుకున్నారు. వ్యక్తిగత విభాగంలో ద.మ.రైల్వే జోన్ నుంచి పలువురు అధికారులు, ఉద్యోగులు అవార్డులు స్వీకరించారు.
ఇవీ చదవండి:ప్చ్... ఎగరలేం!... విమాన ఛార్జీలకు ‘క్యాప్’ పెట్టేదెవరు.?