చిన్నగంజాం మండలం పల్లెపాలెంకు చెందిన మత్స్యకారులు ఆదివారం వేటకు వెళ్లగా వారు వేసిన వలలో సుమారు వేయి కిలోల నల్లకోతి రకం సొర చేప చిక్కింది. పల్లెపాలెంకు చెందిన మత్య్సకారులు రమేష్, సోమయ్య, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, ఏడుకొండలు, చంద్రనారాయణ, బాలకృష్ణ వీరందరూ కలిసి ఆదివారం రాత్రి తీరానికి 16కిలోమీటర్ల దూరంలో పడవ నుంచి వలను వదిలారు. ఈ క్రమంలో పెద్ద సొరచేప వలకు చిక్కింది. సోమవారం ఉదయం వలను చూడగా పెద్ద సొరచేప వలకు పడ్డట్లు గుర్తించారు.
వెంటనే ఆ చేపను ఒడ్డుకు చేర్చడానికి సుమారు పది గంటల సమయం పట్టినట్లు మత్య్సకారులు తెలిపారు. దీంతో ఆ చేప తాకిడికి రూ.50వేల విలువ చేసే వల సైతం తెగిపోయింది. సొరచేప విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆ చేపను చూడటానికి తరలివస్తున్నారు.
ఇదీ చదవండి: 'మాస్క్ ధరించలేదని... అపస్మారకస్థితికి చేరేలా కొట్టారు'