Gay marriage in Hyderabad: భాజాభజంత్రీలు.. చుట్టూ బంధువులు.. హల్దీ, మెహందీ వేడుకలు.. వీటన్నింటి నడుమ వరుడు, వధువు ఒక్కటయ్యే వేడుకే వివాహం. మరి ఆ వివాహంలో పెళ్లిపిల్ల స్థానంలోనూ పిలగాడే ఉంటే అది ప్రత్యేకం. అలాంటి ప్రత్యేక వేడుకకు వేదికయ్యింది హైదరాబాద్. దేశంలో ఇప్పటివరకు పలు చోట్ల లెస్బియన్, గే పెళ్లిళ్లు జరగ్గా.. తెలంగాణలో తొలిసారి ఈ ప్రత్యేక వివాహం జరిగింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం(డిసెంబర్ 08)రోజు... గే జంట సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల సమక్షంలో వీళ్ల పెళ్లి ఎంతో గ్రాండ్‌గా జరిగింది. వేడుకలో ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు.
వాళ్లు ఆశీర్వదించటం విశేషం..
First Gay Wedding in Telangana: ఈ పెళ్లికి ఇద్దరు నూతన వరుల కుటుంబసభ్యులు, సన్నిహితులు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి కొందరు సభ్యులు హాజరయ్యారు. ఫొటోషూట్లు, సన్నిహితుల ఈలలు, గోలలతో ఎంతో కోలాహలంగా వేడుక సాగింది. ఈ వివాహానికి హైదరాబాద్‌కు చెందిన కొందరు ట్రాన్స్‌జెండర్ మహిళలు హాజరై.. గే జంటను ఆశీర్వదిచటం విశేషం. అధికారికంగా ధ్రువీకరణ దక్కకున్నా.. తామ పెళ్లిని ఓ వేడుకలా చేసుకోవాలనుకున్నామని.. అందుకే పంజాబ్, కోల్‌కతా నుంచి ప్రత్యేక దుస్తుల్ని డిజైన్ చేపించి మరీ వివాహం చేసుకున్నామని ఈటీవీతో పంచుకున్నారు సుప్రియో. ఒకర్ని ఒకరు అర్థం చేసుకునే మనసుతో ఇలాగే జీవితాంతం కలిసుంటామని చెబుతున్నారిద్దరు.
8 ఏళ్ల సహజీవనం తర్వాత..
gay couple dating: సుప్రియో చక్రవర్తి ఓ బెంగాలీ కాగా.. హైదరాబాద్‌లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన అభయ్ ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు. సుప్రియో వయసు 31 ఏళ్లు. అభయ్ వయసు 34 ఏళ్లు. తాము ఇద్దరు 'గే'లమని వాళ్లకు చిన్నతనంలోనే తెలిసిందట. వీళ్లిద్దరికి 8 ఏళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. స్నేహం ఇద్దరి మధ్యా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
సమంత కూడా మద్దతు..
gay couple wedding: అయితే.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అక్టోబర్‌లోనే డిసైడ్ అయ్యారు. వెంటనే తమ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. వీళ్ల పెళ్లి చర్చనీయాంశమైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా వీళ్ల పెళ్లికి మద్దతిచ్చింది. అభినందనలు తెలుపుతూ.. వాళ్లు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేసింది.
ఇదీ చూడండి: