First case at IAMC: హైదరాబాద్లో ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ద్వారా వివాదాలు పరిష్కరించుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. హైదరాబాద్లోని సంఘీ సోదరులు ఐఏఎంసీలో వివాదం పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపారు. గిరీష్ సంఘీ, రవి సంఘీ, ఇతర సోదరుల మధ్య సిమెంటు, సింథటిక్స్, పాలిజిప్స్, జిప్పర్స్ పరిశ్రమలకు సంబంధించిన 2008లో వివాదం తలెత్తింది. సంఘీ కుటుంబ సభ్యుల పారిశ్రామిక వివాదంపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎదుట పదమూడేళ్లుగా కొనసాగుతోంది.
sanghi brothers dispute case: వివాదానికి సంబంధించిన ఆరు కేసులు ఇవాళ ఎన్సీఎల్టీ హైదరాబాద్ ప్రెసిడెంట్ జస్టిస్ రామలింగం సుధాకర్, సభ్యుడు అరెకపూడి వీరబ్రహ్మారావుతో కూడిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. పదమూడేళ్లుగా సాగుతున్న వివాదం వల్ల పరిశ్రమలు దెబ్బతిన్నాయని.. ఐఏఎంసీ వద్ద వివాదం పరిష్కరించుకోవాలని ఎన్సీఎల్టీ సూచించగా... సంఘీ సోదరులు అంగీకరించారు. ఐఏఎంసీ వద్ద హాజరై పరిష్కరించుకోవాలని ఎన్ఎస్ఎల్టీ ఆదేశించింది. ఐఏఎంసీ నివేదిక కోసం కేసుల విచారణను జనవరి 28కి వాయిదా వేసింది. దిల్లీకి చెందిన లలిత్ మోదీ కుటుంబం కూడా ఐఏఎంసీలో వివాదం పరిష్కరించుకునేందుకు ఇటీవల అంగీకరించింది.
ఇవీ చూడండి: