ప్రస్తుతం కరోనా పాజిటివ్ అంటే అయినోళ్లు కూడా అంటరానోళ్లలా చూస్తున్నారు... అలాంటిది కరోనా రోగులను కనీసం పీపీఈ కిట్లు కూడా లేకుండా ప్రాణాలకు తెగించి కాపాడారు అగ్నిమాపక సిబ్బంది. ఏపీలోని విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఉన్న బాధితులను ఎటువంటి పీపీఈ కిట్లు కూడా లేకుండా అగ్నిప్రమాదం నుంచి కాపాడారు... అగ్నిమాపక సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా డ్యూటీ చేశాం... కానీ ఇప్పుడు ఇంటికెళ్లాలంటే కుటుంబం గుర్తొస్తోందని కంటతడిపెడుతున్నాడు... ఓ అధికారి. కరోనా భయం మనిషి మానవత్వాన్ని మరుగున పడేసింది.. అయినోళ్లును దూరం చేసింది. బంధాలను భరించలేమనుకునేలా చేసింది... ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాధితులను కాపాడినందుకు ఓ పక్క గర్వంగా ఉన్నా.. తమ వల్ల వారి భార్యాపిల్లలు కరోనా బారిన పడతారేమో అని భయపడుతున్నారు.
ఏదేమైనా...ఫైర్ సిబ్బంది భయపడకుండా కరోనా బాధితులను కాపాడటంతో ప్రాణనష్టం కాస్తయినా తగ్గిందని స్థానికులు అంటున్నారు.
ఇవీ చూడండి: విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి