ETV Bharat / city

మార్చిలో పెరిగిన మంటలు.. రోజుకు 800 ఎకరాల అడవి బుగ్గిపాలు.. - అగ్నిప్రమాదాల సంఖ్య

Forest fire accidetns: అటవీప్రాంతాలను వేసవి ఎండలు దహించేస్తున్నాయి. చెట్ల ఆకులు రాలి ఎండిపోతుండగా, ఏ చిన్న నిప్పు రవ్వ పడినా అవి అంటుకుని మంటలు వ్యాపిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు సగటున ఎనిమిది వందల ఎకరాల అటవీప్రాంతం బుగ్గి పాలవుతోంది.

fire accidents in march in telangana
fire accidents in march in telangana
author img

By

Published : Mar 25, 2022, 10:23 AM IST

Forest fire accidetns: జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే మార్చిలో అగ్నిప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెలలో మూడు వారాల వ్యవధిలోనే అగ్నిప్రమాదాలు 8,661కి చేరాయి. 16,841.40 ఎకరాల అడవి దగ్ధమైంది. ఏటా నవంబరు నుంచి అటవీ అగ్నిప్రమాదాలు సంభవించడం పరిపాటిగా మారింది. మార్చి 22 వరకు 32,008 ప్రమాదాలు జరగ్గా 79,040 ఎకరాల అటవీప్రాంతం కాలిపోయింది. అత్యధికంగా ములుగులో 5,191, ఆ తర్వాత భద్రాద్రి-కొత్తగూడెంలో 4,600, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3,168 ప్రమాదాలు జరిగాయి. విస్తీర్ణం పరంగా అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా (నల్లమల అటవీప్రాంతం) 14,606 ఎకరాలు, భద్రాద్రి-కొత్తగూడెంలో 9,181.29 ఎకరాలు, ములుగులో 6,173.40 ఎకరాల మేర అడవి ఆహుతైపోయింది.

ముందస్తు హెచ్చరికలున్నా...

అడవుల్లో అగ్నిప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు పంపే విధానం అమల్లో ఉంది. ఎస్‌ఎన్‌పీపీ, మోడీస్‌ ఉపగ్రహాల నుంచి హైదరాబాద్‌ బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌ఈ)కి ఈ సమాచారం అందుతుంది. అక్కడినుంచి దేహ్రదూన్‌లోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐకి) పంపిస్తారు. ఎఫ్‌ఎస్‌ఐ నుంచి అన్ని రాష్ట్రాల అటవీశాఖలకు ముందస్తు సమాచారం వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,803 అటవీ కంపార్ట్‌మెంట్లు ఉండగా, 1106 కంపార్ట్‌మెంట్లను ఎక్కువ ప్రమాదాలు జరిగేవిగా గుర్తించారు. అటవీప్రాంతాల్లో 3890 నివాస ప్రాంతాలుంటే.. వాటిలో 1279 చోట్ల అగ్ని ప్రమాదాలపరంగా అధిక ముప్పు ఉన్నవిగా వర్గీకరించారు. సమాచారపరంగా ఇన్ని ఏర్పాట్లున్నా, ప్రమాదాల నివారణ సాధ్యం కావడంలేదు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.