ETV Bharat / city

Fire Accident in Kadapa: పాత సామాన్ల గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. ఆస్తినష్టం ఎంతంటే.. - fire accident in scrap godown in kadapa

Fire Accident in Kadapa: ఏపీలోని కడప శివారులోని ఊటుకూరు వద్ద పాత సామానుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగ వ్యాపించింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Fire Accident in Kadapa
Fire Accident in Kadapa
author img

By

Published : Feb 24, 2022, 5:10 PM IST

Fire Accident in Kadapa: ఏపీలోని కడప శివారులోని ఊటుకూరు వద్ద పాత సామానుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగ వ్యాపించింది. దీనివల్ల జనం ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వైపు గాలి వీస్తుండడంతో మంటలు అదుపులోకి రావడం లేదు.

మధ్యాహ్న సమయంలో గోదాంలో పని చేస్తున్న వాళ్లు అందరూ భోజనం చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. దీనికి తోడు గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లో మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పాత అట్టపెట్టెలు, పాత సామాన్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. సమీపంలో ఉన్న వారందరినీ అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు. ఇప్పటికే 10 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల నుంచి రూ. 60 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లిన్నట్లు సమాచారం. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ప్రమాదంపై పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.

Fire Accident in Kadapa: పాత సామాన్ల గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

ఇదీచూడండి: Ukraine Crisis: ఉక్రెయిన్​లో యుద్ధ పరిస్థితులపై తెలుగు విద్యార్థిని ఏమన్నారంటే?!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.