వ్యాపార సముదాయాలు, సూపర్ మార్కెట్, హోటల్, టిఫిన్ సెంటర్ల యజమానులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ బోర్డు శానిటరీ సూపరిండెంట్ దేవేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకుల మహేందర్ హెచ్చరించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వారు పర్యటించి కొవిడ్-19 నిబంధనలను పాటించని వ్యాపార నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
బోయిన్పల్లి మనోవికాస్ నగర్‌లోని రిలయన్స్ సూపర్ మార్కెట్లో కొవిడ్ నిబంధనలను పాటించకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల మేనేజర్‌కు 2 వేల రూపాయల జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకుల మహేందర్ తెలిపారు. ఇతర దుకాణాలను కూడా తనిఖీ చేశారు. వివిధ వస్తువులను కొనుగోలు చేసేందుకు సూపవర్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని... వినియోగదారులకు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇదీ చదవండి: మానవత్వం చాటుకున్న మేయర్ విజయలక్ష్మి