రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు ఐదో రోజు అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 10 గంటలకే ఆంక్షలు అమల్లోకి రానున్న దృష్ట్యా... మార్కెట్లకు పోటెత్తారు. ఆదివారం కావటంతో మాంసాహార దుకాణాలు కిక్కిరిసాయి. పలు చోట్ల ప్రజలు కొవిడ్ నిబంధనలు మరచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.
హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఎర్రగడ్డ మార్కెట్ వద్ద... కొనుగోళ్లు జోరుగా సాగాయి. ముషీరాబాద్‌లో చేపల మార్కెట్ వద్ద.. కొవిడ్ నిబంధనలను ప్రజలు గాలికి వదిలేశారు. సంగారెడ్డి, కరీంనగర్‌లో చికెన్, మటన్, చేపల మార్కెట్లు... ప్రజలతో కిటకిటలాడాయి. ఆంక్షలు అమల్లోకి వచ్చినా.. పలు చోట్ల ప్రజలు మాంసాహార దుకాణాల వద్ద క్యూ లైన్ కట్టారు.
- ఇదీ చదవండి : పరిశ్రమలపై లాక్‌డౌన్ పిడుగు.. పడిపోయిన ఉత్పత్తి