తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న 15 రోజుల శిశువు మాయమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. చినకొండేపూడికి చెందిన సుజాత 15 రోజుల క్రితం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో పుట్టింట్లోనే ఉంటోంది. సుజాత రాత్రి బిడ్డను పక్కనే పెట్టుకుని నిద్రించింది. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసే సరికి పక్కనున్న బిడ్డ మాయమైంది. కంగుతిన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై...తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. సుజాత భర్త సతీష్ కూడా అదే గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. తెలిసిన వారే బిడ్డను మాయం చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఐటమ్ సాంగ్లో ఛాన్స్ అన్నాడు.... ఐదు లక్షలు నొక్కేశాడు...