Ministers take charge: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.. సచివాలయంలో నేడు బాధ్యతలు చేపట్టారు. ఆయా శాఖల మంత్రులు పలు ప్రాజెక్టులపై సంతకాలు చేశారు.
రోడ్లకు పునర్వైభవం: రోడ్ల భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రాజా సచివాలయంలోని 4వ బ్లాకులో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని రోడ్లకు పునర్వైభవం తెస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగలేనిది వాస్తవమని తెలిపారు. రూ.1,158 కోట్లతో మొదటి దశలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. రూ.170 కోట్లతో ప్రారంరంభించబోతున్న ఏటిమొగ్గ, అవనిగడ్డ, మాదిపాడు, జగ్గయ్యపేట ప్రాజెక్టులపై మొదటి సంతకం చేశారు.
వివాదాలు లేకుండా రీసర్వే కార్యక్రమం: రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. తనకంటూ వ్యక్తిగతంగా లక్ష్యాలు ఏమీ లేవని, సీఎంకు ఉన్న లక్ష్యాలే తన లక్ష్యాలని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ రెవెన్యూ కోసం కాదు,.. ఈ శాఖను భూయాజమాన్య శాఖ అంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వివాదాల మధ్య ఉన్న భూముల కారణంగా ఆర్ధికంగా నష్టం, వివాదాల్లేని భూముల వల్ల జీడీపీ పరోక్షంగా లాభం వస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని వివాదరహితంగా చేపడతామని తెలిపారు.
జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను: సచివాలయం రెండో బ్లాక్‌లో పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టారు. మంత్రి వర్గంలో కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని తెలిపారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని రోజా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని, క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు. గండికోట నుంచి బెంగుళూరుకు టూర్ కోసం.. కొత్తగా బస్సులు ప్రారంభం కాగా.. ఆ ఫైల్‌పై రోజా మొదటి సంతకం చేశారు.
ఇదీ చదవండి: