ETV Bharat / city

జ్వరం వస్తే.. కరోనా పరీక్షలు చేయాల్సిందే - ఫీవర్​ సర్వైలెన్స్

మీకు జలుబు చేసిందా.. జ్వరం కూడా వచ్చిందా? అయితే మీకు కరోనా పరీక్షలు చేయాల్సిందే. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతోన్న తరుణంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫీవర్​ సర్వైలెన్స్​కు శ్రీకారం చుట్టింది. జ్వరం, జలుబు లక్షణాలు ఉన్నవారి వివరాల కోసం ఇంటింటికి సర్వే చేపట్టనుంది.

Fever serway lines
జ్వరం వచ్చిన ప్రతి వారికి కరోనా పరీక్షలు
author img

By

Published : Mar 24, 2020, 6:26 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం నివారణ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఫీవర్ సర్వైలెన్స్​కి శ్రీకారం చుట్టింది. జ్వరం వచ్చిన ప్రతి వారికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

ఇంటింటా సర్వే..

ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు సహా.. అనుమానితులు ఉన్న ప్రాంతాల్లోనూ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో కెమికల్స్​ని పిచికారి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, జ్వరం జలుబు లక్షణాలు ఉన్నవారి వివరాల కోసం ఇంటిటి సర్వేని నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.