ETV Bharat / city

అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ విషవాయువు కలకలం.. 150 మందికి అస్వస్థత - Female employees sick due to toxic gas leak in Achyutapuram

విషవాయువు లీకై 50 మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత

author img

By

Published : Aug 2, 2022, 8:05 PM IST

Updated : Aug 2, 2022, 9:33 PM IST

20:03 August 02

అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ విషవాయువు కలకలం.. 150 మందికి అస్వస్థత

విషవాయువు లీకై 50 మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత

Poison gas leak: ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీకైంది. సీడ్స్‌ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స అందించారు. మరి కొందరని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

పెద్ద సంఖ్యలో మహిళలు వాంతులు, వికారంతో ఆర్తనాదాలు చేశారు. బి షిఫ్ట్‌లో ఫ్యాక్టరీలో దాదాపు 4వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

మే నెల మొదటి వారంలో కూడా ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్‌ దుస్తుల కంపెనీ, సమీపంలోని పోరస్‌ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ సహా ఇతర అధికారులతో రసాయన వాయువు లీకేజీపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం వాటిని ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం.

...

ఇవీ చూడండి..

రైతులను పొట్టబెట్టుకున్న రాకాసి పిడుగులు.. ఒకేరోజు వేర్వేరు చోట్ల ముగ్గురు బలి..

ఇంటిపై కూలిన కొండచరియలు.. ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం

Last Updated : Aug 2, 2022, 9:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.