ETV Bharat / city

Paddy procurement: ధాన్యం సేకరణలో ప్రమాణాల్లో కేంద్రం మార్పులు.. రైతుల తీవ్ర వ్యతిరేకత - farmers on paddy procurement

ధాన్యం కొనుగోలు ప్రమాణాల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. తేమ శాతాన్ని తగ్గించటంతో పాటు రంగు మారిన, మొలకలొచ్చిన ధాన్యం కొనుగోలు నిబంధనలను మార్చింది. ఈ వానాకాలం సీజను నుంచే వర్తించేలా మార్పులు చేసింది. ఈ నిర్ణయంపై రైతులు, మిల్లర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Paddy procurement
Paddy procurement
author img

By

Published : Aug 29, 2021, 8:31 AM IST

నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ధాన్యం, బియ్యం కొనుగోలు ప్రమాణాల్లో తాజాగా మార్పులు తీసుకొచ్చింది. ఈ వానాకాలం సీజను నుంచే వర్తించేలా తేమ శాతాన్ని తగ్గించటంతో పాటు రంగు మారిన, మొలకలొచ్చిన ధాన్యం కొనుగోలు నిబంధనలను మార్చింది. బియ్యంలో ఉండే నూకల శాతాన్నీ తగ్గించింది. ఇందుకోసం ఎప్పటి నుంచో ఉన్న మార్గదర్శకాలను సవరించటం, దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలుకు ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతో రైతులు, మిల్లర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రతికూలతలు పట్టవా..!

పంటకోతకు వచ్చేసమయంలో ఒక్కో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. పంట విక్రయాలు ప్రారంభమయ్యే దశలో తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తుంటాయి. ఫలితంగా ధాన్యంలో తేమ శాతం పెరుగుతుంటుంది. తడిసిన ధాన్యాన్ని మరపట్టించటం(మిల్లింగ్‌)తో బియ్యంలో ఎర్రటి గింజలతో పాటు నూకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరి దిగుబడి అనూహ్యంగా ఉంటోంది. 2020-21లో రాష్ట్రంలో ఏకంగా 200 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దేశంలో ఇదే అత్యధికం. ఇంత భారీగా వచ్చే ధాన్యాన్ని కొనాలంటే మౌలిక సదుపాయాలూ అంతే స్థాయిలో అవసరం. వాటిని కల్పించకుండా ప్రమాణాల్లో మార్పులు తేవటంపై రైతులు, మిల్లర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక వ్యాపారుల ఇష్టారాజ్యం

ధాన్యంలో ప్రస్తుత 17 శాతం తేమ నిబంధనలను అడ్డుపెట్టుకుని వ్యాపారులు తరుగు పేరుతో రైతుల పంటను దోచుకుంటున్నారు. తేమ శాతాన్ని తాజాగా 16కి తగ్గించటం అంటే.. ఇక వ్యాపారుల ఇష్టారాజ్యం నడుస్తుందన్న ఆందోళన అన్నదాతల్లో కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటను విక్రయించేందుకు రైతులు కొన్నిసార్లు వారం, పది రోజులపాటు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. లేకుంటే వ్యాపారులు చెప్పిన ధరలకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోవటంతో రైతులు మరింతగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో తాలు, తప్ప, మట్టిగడ్డలు తదితరాలనూ కేంద్రం రెండు నుంచి ఒక శాతానికి తగ్గించటం వారిని సంకటంలోకి నెడుతోంది. ఇప్పటికే పై సాకు చూపి మిల్లర్లు బస్తాకు ఆరు నుంచి పది కిలోలు కోత పెడుతున్నారు.

తెలంగాణ రైతులపై గొడ్డలిపెట్టు

'కేంద్ర ఏకపక్ష నిర్ణయం తెలంగాణ రైతులపై గొడ్డలిపెట్టు వంటిది. ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించటం రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను, ధాన్యం కొనుగోలు ఏజెన్సీలను సంప్రదించకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటం అనైతికం. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.' - మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఛైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ

కేంద్రం తీరు సరికాదు

'ధాన్యంలో తేమ శాతం, బియ్యంలో నూక శాతం భూసారం ఆధారంగా ఉంటాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, వాతావరణ మార్పులు కూడా కారణమవుతాయి. వాటిని పట్టించుకోకుండానే కేంద్రం ప్రస్తుత ప్రామాణికాల్లో కోత పెడుతుండటం వల్ల మిల్లింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతాయి. రాష్ట్రప్రభుత్వాలను, మిల్లర్లను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవటం దారుణం.' - గంపా నాగేందర్‌, అధ్యక్షుడు, తెలంగాణ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌

ఇదీ చదవండి : కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తాం: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.