ఉస్మానియా ఆసుపత్రిలోకి చేరిన నీళ్లే... ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతి ఏడాది ఆస్పత్రి నిర్వహణకు నిధులు ఎందుకు ఖర్చు చేయడంలేదని నాగం ప్రశ్నించారు. డీఎంహెచ్‌వో ఉస్మానియా విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రోజువారీగా కరోనాపై సమీక్షలు నిర్వహించాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చిన్న చిన్న రోగాలకు కూడా సీఎం స్థాయిలో సమీక్షలు జరిగేవని గుర్తు చేశారు.
హైదరాబాద్ నగరంలో నిమ్స్‌ను తలదన్నే నాలుగు ఆస్పత్రులను కడతామన్న సీఎం కేసీఆర్‌కు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉస్మానియా అస్పత్రిలో కొత్త భవనాలు నిర్మించాలని నాగం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 40 వేలు దాటిన కరోనా కేసులు