ETV Bharat / city

Covid: అపోహలతోనే అంతిమ సంస్కారాలకు దూరం! - కరోనా మహమ్మారి

సమాజంలో మంచి పేరు, ఉన్నత చదువులు, ఆస్తులు, వందలు, వేలాదిగా బంధువులు, స్నేహితులు, అనుచరులు... ఇలాంటివేవీ ఎక్కువమంది కొవిడ్‌ మృతులకు గౌరవాన్ని ఇవ్వడం లేదు. అపోహల కారణంగా చాలా మృతదేహాలు అనాథల్లా కాటికేగుతున్నాయి. అంబులెన్సు సిబ్బందే ఆ నలుగురవుతున్నారు. కాటికాపరే పెద్దకొడుకు అవుతున్నాడు. చివరికి అస్థికలు తీసుకోడానికీ చాలామంది కుటుంబ సభ్యులు ముందుకు రావట్లేదు. అపోహలతోనే ఇలాంటి అమానవీయ పరిస్థితులు తలెత్తుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

family members not doing funerals for covid patients dead bodies

author img

By

Published : May 27, 2021, 1:13 PM IST

కరోనా మహమ్మారి బంధాలను సైతం దూరం చేస్తోంది. బతికున్నప్పుడే కాదు... భౌతికంగా దూరమైనా... అపోహలు వారి మధ్య అడ్డుకట్టలవుతున్నాయి. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకురావటం లేదు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

నిబంధనలే రక్ష..

చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మరణించాక ఆస్పత్రి సిబ్బంది మృతదేహంపై క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేసి భద్రంగా ప్లాస్టిక్‌ కవర్లో ఉంచుతారు. కుటుంబ సభ్యులు కోరిన అంబులెన్సులో ఎక్కిస్తారు. శవాన్ని నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లాలి. ఆరు అడుగుల లోతు గుంతలో పాతిపెట్టి పిడికెడు మట్టి వదలొచ్ఛు లేదా తల కొరివి పెట్టి దహనం చేయొచ్ఛు శవాన్ని ముట్టుకోకుండా, కొద్ది దూరంలో నిల్చుని సంప్రదాయ బద్ధంగా వీడ్కోలు చెప్పవచ్ఛు రెండు మాస్కులు ధరించి, అవసరమైతే పీపీఈ కిట్లు వేసుకుని ఆయా కార్యక్రమాలు పూర్తి చేస్తే కొవిడ్‌ సోకే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రులనూ చూడట్లేదు

* సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 20లక్షలు వెచ్చించి చికిత్స తీసుకున్న వ్యాపారి కొవిడ్‌తో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు, పెద్ద కుటుంబం ఉంది. అంత్యక్రియలకు హాజరయ్యే ధైర్యం చేయలేదు. అంబులెన్సు సిబ్బందికే బాధ్యత అప్పగించారు. వీడియో కాల్‌ ద్వారా అంతిమ సంస్కారాలను వీక్షించారు.

* గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో అనాథ శవాలు ఉన్నాయి. సంబంధీకులు వాటిని తీసుకెళ్లేందుకు రావడం లేదు. గచ్చిబౌలి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించిన 55 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగిని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. అధికారులే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

* ఈఎస్‌ఐ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, బన్సీలాల్‌పేట, కాచిగూడ తదితర శ్మశాన వాటికల్లో ఎక్కువగా కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు జరుగుతుంటాయి. వాటిలో ఒక్కోచోట వందకుపైగా మృతులకు సంబంధించిన అస్థికలు అలాగే ఉండిపోయాయి. మృతుల బంధువుల రాక కోసం వాటికల నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు.

కాటికాపరులే ఉదాహరణ

శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మృతుల బంధువులు, అంబులెన్సు సిబ్బంది, కాటికాపరులు వాడిన మాస్కులు, పీపీకిట్లు, గ్లౌజులను ప్రత్యేక చెత్త డబ్బాల్లో నింపుతున్నాం. వాటిని ప్రత్యేక వాహనంలో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి కాల్చివేస్తున్నాం. మృతదేహాలను దహనం చేసే ప్రాంతంలో తరచూ సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నాం. సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఇప్పటి వరకు ఏ కాటికాపరీ కొవిడ్‌ బారిన పడలేదు. ఇతర సిబ్బంది కూడా ఆరోగ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. - డాక్టర్‌ భార్గవ నారాయణ, సహాయ వైద్యాధికారి, జీహెచ్‌ఎంసీ

ఇదీ చూడండి: కొవిడ్​ మృతదేహాన్ని ప్యాక్ చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.