ETV Bharat / city

నకిలీ పత్రాలతో స్థలాలు విక్రయించే ముఠా అరెస్ట్​ - land selling on fake documents

నకిలీ పత్రాలతో స్థలాలను విక్రయించే ముగ్గురు సభ్యుల ముఠాను హయత్​నగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పత్రాలతో స్థలాలు విక్రయించే ముఠా అరెస్ట్​
author img

By

Published : Aug 26, 2019, 1:06 PM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్​ పరిధిలో నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలను విక్రయించే ముఠా సభ్యులను హయత్​నగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద అంబర్​పేట్​లోని సర్వే సంఖ్య 654లోని ఫ్లాట్​ నంబర్​ 105, 106లను నకిలీ పత్రాలతో విక్రయించినట్లు సత్యదేవి అనే మహిళ హయత్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హరిహరకుమార్​, ప్రేమ్​కుమార్​, రేపాక కరుణాకర్​లను అరెస్టు చేశారు. వీరిపై సుల్తాన్​ బజార్​ పోలీస్​స్టేషన్​లో నకిలీ ధ్రువపత్రాల తయారీ కేసు, చౌటుప్పల్​ పీఎస్​లో నాలుగు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి పలు నకిలీ పత్రాలు, రబ్బరు స్టాంపులు, నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పత్రాలతో స్థలాలు విక్రయించే ముఠా అరెస్ట్​

ఇవీ చూడండి: ఏటీఎం ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.