ETV Bharat / city

150 పోలింగ్​ కేంద్రాల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ

author img

By

Published : Nov 27, 2020, 11:56 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి సాఫీగా, పారదర్శకంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. వెబ్ కాస్టింగ్, సీసీకెమెరాల ఏర్పాటు సహా మైక్రో అబ్జర్వర్ల సేవలు వినియోగించుకోనున్నారు. ఓటరు గుర్తింపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. డివిజన్​కు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు రంగం సిద్ధమవుతోంది.

ghmc
ghmc

బల్దియా పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రచార పర్వం మరో మూడు రోజుల్లో ముగియనుంది. వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి సాఫీగా, పారదర్శకంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. వెబ్ కాస్టింగ్, సీసీకెమెరాల ఏర్పాటు సహా మైక్రో అబ్జర్వర్ల సేవలు వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలు ఉండగా... 2,500 వరకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అథారిటీ, రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ తీరు, పోలింగ్ కేంద్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మిగతా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నారు. మైక్రో అబ్జర్వర్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండనున్నారు.

డివిజన్​కు ఒకటి చొప్పున

ఓటుహక్కు వినియోగించుకునే సమయంలో ఓటరు గుర్తింపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. యాప్ సహాయంతో ముఖకవళికల ద్వారా ఓటరును గుర్తించేలా ఫేసియల్ రికగ్నైజేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం 150 డివిజన్లలో ఒక్కో డివిజన్​లోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురపాలక ఎన్నికల సమయంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలిక పరిధిలోని పది పోలింగ్ కేంద్రాల్లో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 83 శాతం వరకు ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా సాఫీగా సాగినట్లు గుర్తించారు.

అనుభవాల ఆధారంగా

ఓటర్ల జాబితాలో ఫొటో సరిగా లేకపోవడం, పోలింగ్ కేంద్రంలో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని చోట్ల మాత్రమే కొంత మేర సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఆ అనుభవాల ఆధారంగా ఈ మారు మరింత పక్కాగా ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వినియోగించాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఈ మేరకు అటువంటి పోలింగ్ కేంద్రాలను ఈ పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ఎంపిక చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుభవాల ఆధారంగా భవిష్యత్​లో జరిగే ఎన్నికల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఇదీ చదవండి : విద్యావంతులున్నా... ఓట్లేయడం లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.