డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ ఇంఛార్జి రిజిస్ట్రార్ లక్ష్మారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.
బీటెక్, ఫార్మసీ కోర్సులు చదివిన విద్యార్థులు సైతం సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సు చేయవచ్చన్నారు. మరిన్ని వివరాలను 7382929570/580/590/600లలో లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 04023680333/555లలో పొందవచ్చని సూచించారు.
- ఇదీ చూడండి : నేటి నుంచి రెండో విడత వైద్యవిద్య ప్రవేశాలు