తెలంగాణ నుంచి ఎగుమతుల(Exports Hubs in Telangana)ను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు 33 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల(Exports Hubs in Telangana)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్ణయించింది. ఉత్పత్తుల ఎంపిక, మౌలిక వసతుల కల్పన, కార్యాచరణకు జిల్లాస్థాయి కమిటీలను నియమించనుంది. ప్రస్తుతం దేశం నుంచి జరుగుతున్న వస్తు ఎగుమతుల్లో రాష్ట్రం మొదటి అయిదు స్థానాల్లో ఉంటోంది. 2019-20లో రాష్ట్రం నుంచి రూ.2.10 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అందులో రూ.1.45 లక్షల కోట్లు ఐటీ వాటా కాగా రూ.65 వేల కోట్ల మేరకు వస్తు రంగంలో ఉన్నాయి.
ఎగుమతుల రంగంలో ప్రథమ స్థానం పొందే లక్ష్యంతో వికేంద్రీకృత ప్రోత్సాహక విధానం అవలంబించాలని, ప్రతి జిల్లాను ఓ హబ్(Exports Hubs in Telangana)గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్ణయించింది. ఎగుమతుల కోసం ఈ ఏడాది రూ.100 కోట్ల ప్రోత్సాహక నిధిని కేటాయించింది. తాజాగా జిల్లాస్థాయిలో ఎక్స్‌పోర్ట్ కేంద్రాల(Exports Hubs in Telangana) ఏర్పాటుకు మరో రూ.100 కోట్లు వెచ్చించనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో 5 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ కేంద్రం(Exports Hubs in Telangana)లో శుద్ధి సౌకర్యాలు, కస్టమ్స్ కార్యాలయం వంటివి ఉంటాయి.
ఎగుమతుల వ్యూహానికి కమిటీలు
అన్ని జిల్లాల్లోని ఉత్పత్తులను గుర్తించి, వాటి ఎగుమతుల వ్యూహాన్ని రూపొందించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతాధికారులు, నిపుణులతో జిల్లాస్థాయి కమిటీల(Exports strategy Committees)ను పరిశ్రమలశాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ(Exports strategy Committees)లు జిల్లా స్థాయిలో సదస్సులు, సమావేశాలు, కార్యశాలలు నిర్వహించి ఎగుమతులపై ఉత్పత్తిదారులకు అవగాహన కల్పిస్తాయి. ఎగుమతుల కోసం శిక్షణ, శుద్ధి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తాయి. అలానే ఎగుమతులకు అవకాశం ఉన్న చేనేత, హస్తకళాకృతులు, ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక ప్రదర్శనలకు పంపించాలని ప్రభుత్వం(Telangana Government) యోచిస్తోంది. తద్వారా వాటి ఎగుమతులు(exports) విస్తరించే వీలుందని అంచనా వేస్తోంది.