పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ నిర్వాసితులు.. న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. నూతన గ్రామం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని అమలు చేయకుండా.. గ్రామ పెద్దలు కులాల ప్రతిపాదికన స్థలాలు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని బండరావి పాకుల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామ సభలో.. దళితులు దక్షిణాన ఉండాలంటూ తీర్మానించి తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ చాటుగా ఇంటింటికి తిరుగుతూ.. పంచాయతీ రికార్డుల్లో కాకుండా.. తెల్ల కాగితంపై సంతకాలు పెట్టిస్తున్నారని వాపోయారు. గ్రామ సభ నిర్వహించి లక్కీ డిప్ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించాలని వారు వేడుకున్నారు.
ఇదీ చదవండి: మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు