ETV Bharat / city

మద్యాన్ని గరిష్ఠ చిల్లర ధరకు మించి అమ్మితే ఇక అంతే..!

రాష్ట్రంలో దసరా సందర్భంగా మద్యాన్ని గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ హెచ్చరించింది. ఎమ్మార్పీకి మించి అమ్మితే అపరాధ రుసుముతో పాటు వారం రోజులు లైసెన్స్​ సస్పెండ్​ చేస్తామని తెలిపింది.

మద్యాన్ని గరిష్ట చిల్లర ధరకు మించి అమ్మితే ఇక అంతే..!
author img

By

Published : Oct 7, 2019, 12:06 AM IST

Updated : Oct 7, 2019, 9:33 AM IST

మద్యాన్ని గరిష్ఠ చిల్లర ధరకు మించి అమ్మితే ఇక అంతే..!

తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని మద్యాన్ని గరిష్ఠ చిల్లర ధరకు మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ హెచ్చరించింది.‌‌‌‌‌‌‌ ‌‌‌షాపుల యజమానులు ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మితే రూ.2 లక్షల అపరాధ రుసుం విధించడంతోపాటు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారం రోజులు దుకాణం లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో ఎనిమిది వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులపై ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు అదనంగా నాలుగు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పది ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 34 జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎమ్మార్పీకి మించి అమ్మే వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాంపల్లిలోని స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ‌‌కంట్రోల్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని సోమేశ్​ కుమార్​ తెలిపారు. ఫిర్యాదులు అందగానే దాడులు చేయాలని ఎక్సైజ్‌ స్టేషన్ల అధికారులకు, సబ్‌ డివిజనల్‌ అధికారులకు, జిల్లా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించామని ఆయన వివరించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలతోపాటు ఇతర ఉల్లంఘనలపై కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

ఎక్సైజ్​ కమాండ్​ కంట్రోల్​ కేంద్రాల ఫోన్​నంబర్లు ఇలా ఉన్నాయి.

క్రమసంఖ్య కమాండ్​ కంట్రోల్​ కేంద్రం ఫోన్​ నంబరు
1 హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయం 040–-24733056
2 హైదరాబాద్‌ జిల్లా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 040-–24746884
3 రంగారెడ్డి 040–24600450
4 ఆదిలాబాద్‌ 08732–220229
5 నిజామాబాద్‌ 08762–237551
6 మెదక్‌ 08455–-271232
7 నల్గొండ 08682–224271

ఇవీ చూడండి: బాగా నిద్రపోవడంపై చర్చించేందుకు అంతర్జాతీయ సదస్సు

Last Updated : Oct 7, 2019, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.