ETV Bharat / city

ఓటమి భయంతోనే భాజపాపై ఆరోపణలు: వివేక్‌

సంబంధం లేని ఓ వ్యాపార లావాదేవీల వ్యవహారంలో హైదరాబాద్‌ సీపీ తన పేరు లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ తెలిపారు. దుబ్బాక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే... కేసీఆర్ ఫామ్ హౌస్​పై, ప్రగతి భవన్​పై పోలీసులు సోదాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

EX MP Vivek Fires on CM KCR
ఓటమి భయంతోనే భాజపాపై ఆరోపణలు
author img

By

Published : Nov 1, 2020, 10:46 PM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే తెరాస నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ అన్నారు. సంబంధం లేని ఓ వ్యాపార లావాదేవీల వ్యవహారంలో హైదరాబాద్‌ సీపీ తన పేరు లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తనపై వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని.. పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్న సీఎం కేసీఆర్‌పై పరువు నష్టం దావా వేసేందుకు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు వివేక్‌ చెప్పారు.

దుబ్బాక ఎన్నికల కోసం పోలీసులను వాడుకొని అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ భాజపా గెలుపు ఖాయమన్నారు. ప్రజలు కేసీఆర్ తుగ్లక్ పాలన పట్ల విసుగు చెందారని విమర్శించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే... కేసీఆర్ ఫామ్ హౌస్​పై, ప్రగతి భవన్​పై పోలీసులు సోదాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓటర్లకు పంచేందుకు డబ్బులన్నీ తెరాస పార్టీ అక్కడి నుంచే పంపిస్తోందన్నది బహిరంగ రహస్యమన్నారు.

ఇవీచూడండి: రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత.. ఆ పార్టీ నేతదేనట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.