చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్‌లోని ఆయన స్వగృహంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సతీసమేతంగా జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు సేవా కార్యక్రమాల కోసం విరాళాలూ అందించారు.
చేవెళ్ల ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం తన అభిమానులు స్వచ్ఛభారత్ ట్రక్కులకు నిధులు కేటాయించడంపై ఆనందంగా ఉందని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. పెద్ద మంగళారం గ్రామంలో బయో గ్యాస్ ప్లాంట్ లబ్ధిదారులతో కలిసి భోజనం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని... ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కేసీఆర్ ఆతిథ్యానికి ట్రంప్ ఫిదా