ETV Bharat / city

'ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల నాపై కక్ష సాధిస్తున్నారు'

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ అత్యవసర పిటిషన్​పై హైకోర్టు జరిపిన విచారణపై ఆయన స్పందించారు. త్వరలోనే పూర్తి విచారణ జరిగి... ప్రభుత్వ బాధ్యతారాహిత్యం బయటపడుతుందని స్పష్టం చేశారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై కక్ష్యపూరింతంగా వ్యవహరించి అవమానించటం దేశంలో ఇదే మొదటిసారి అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

ex minister etela rajender responded on high court hearing on land dispute

author img

By

Published : May 4, 2021, 3:40 PM IST

Updated : May 4, 2021, 3:49 PM IST

'ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల నాపై కక్ష సాధిస్తున్నారు'

ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టు త్వరలోనే రుజువవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై ధర్మాసనం జరిపిన విచారణపై ఆయన స్పందించారు.​ ధర్మాన్ని, న్యాయాన్ని ఎవరూ చెరపలేరన్న ఈటల... ప్రభుత్వాధికారుల బాధ్యతారాహిత్యాన్ని హైకోర్టు నిలదీసినట్లు తెలిపారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై కక్ష్యపూరితంగా వ్యవహరించి అవమానించటం దేశంలోనే ఇదే మొదటిసారి అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కర్కషత్వం చూపుతున్నప్పుడు... రాజ్యాంగాన్ని న్యాయస్థానాలు కాపాడతాయనడానికి ఈ సంఘటనే ఓ ఉదాహరణ అని ఈటల ఉద్ఘాటించారు. ఇలాంటి దుర్మార్గాల నుంచి పేద ప్రజలను కాపాడుతున్నందుకు న్యాయస్థానాలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు.

2014 వరకే కేసీఆర్‌... ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి.. ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధపడ్డారు. ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల తనపై కక్ష సాధిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే తానే రాజీనామా చేసేవాడినని ఈటల తెలిపారు.తాను ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదని ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడే సీఎం కావాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

తాను అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతానని తెలిపిన ఈటల... కాంగ్రెస్‌, భాజపా నేతలతో మాట్లాడితే నేరమనే భావన తెరాసలోనే ఉందన్నారు. తనపై మంత్రులు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఈటల... తన గురించి తెలిసి కూడా ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Last Updated : May 4, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.