YSRCP MLA Sucharitha: వైకాపాను వీడతానంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నూతనంగా నిర్మించిన పంచాయతీ దుకాణాల భవనాలు, సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు.
నేను ప్రతిసారీ వాటిపై వివరణ ఇవ్వాల్సిన పనిలేదు. నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని చెప్పానో ఆ మాటమీదే నిలబడతాను. సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో నాకు సంబంధం లేదు. ఎవరో ఏదో అన్నారని సమాధానం చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాలు మానేస్తే నా ఇంట్లో గృహిణిగానే ఉంటాను. - మేకతోటి సుచరిత, ఏపీ మాజీ హోంమంత్రి
అనంతరం సున్నా వడ్డీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వాలంటీర్లను సత్కరించారు. తాను ఎప్పటికీ వైకాపాలో ఉంటానని తేల్చిచెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీరు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఆకర్షించేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
ఇదీ చదవండి: మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు