ETV Bharat / city

పరీక్షలు జరగలే.. వీసా రాలే.. విదేశీ విద్య ఎలా..?

author img

By

Published : Jun 22, 2020, 12:42 PM IST

విదేశీ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రణాళికలను కొవిడ్ దెబ్బతీసింది. సరిగ్గా ప్రవేశాల సమయంలోనే లాక్​డౌన్ విధించటం, ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల... విశ్వవిద్యాలయాల్లో చేరలేకపోతున్నారు. అడ్మిషన్, వీసా వచ్చినప్పటికీ సెమిస్టర్లు వాయిదా వేసుకుంటున్నారు. విదేశాలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు.

evt bharat special story corona effect on overses education in india
పరీక్షలు జరగలే.. వీసా రాలే.. విదేశీ విద్య ఎలా..?

ఉత్తమ విద్య, ఉన్నతమైన ఉద్యోగం కోసం చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. విదేశాంగ లెక్కల ప్రకారం గతేడాదిలో... 10.9లక్షల మంది విదేశీ విద్య కోసం వెళ్లారు. ఈ ఏడాది మాత్రం లెక్కలన్నీ తారుమారయ్యాయి. కరోనా విజృంభిస్తున్నందున... వేచిచూడాల్సిన పరిస్థి ఏర్పడింది. ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియని ప్రస్తుత సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు.

సాధారణంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ చివరి సెమిస్టర్​లోనే ప్రారంభిస్తారు. ప్రవేశ ప్రక్రియ పూర్తై... విదేశాలకు వెళ్లేప్పుడు సర్టిఫికేట్ తీసుకొని వెళ్తారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ పరీక్షలు జరగలేదు. అవి ఎప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపేందుకు నిరాకరిస్తున్నారు. పరిస్థితి మారే వరకు విద్య కోసం వారు వెళ్లే అవకాశాలు లేవు.

పరీక్షలే జరగలేదు..

విదేశాల్లో చదువుకునే వారు తప్పకుండా రాయాల్సిన టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి ఇంగ్లీషు పరీక్షలు రోజులు జరగలేదు. ఇప్పుడు ఆన్​లైన్​లో ఇంటి నుంచే రాసే వీలు ఉన్నప్పటికీ... విశ్వవిద్యాలయాలు అంగీకరిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉందని కన్సల్టెన్సీ ప్రతినిధులు అంటున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలు లేకుండానే ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొస్తున్నట్టు తెలిపారు.

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఏటా రెండు సార్లు ప్రవేశాలు జరుగుతుంటాయి. ఆగస్టు-సెప్టెంబర్​లో జరిగే ప్రవేశాలు ప్రస్తుతం దాదాపు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది విద్యార్థులు జనవరి-ఫిబ్రవరి ప్రవేశాలు తీసుకోవాలనుకుంటున్నారు. అప్పటికీ పరిస్థుతులు ఇలానే ఉంటే... మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం మొత్తం కోల్పోయినా ఆశ్చర్యం లేదని కన్సల్టెన్సీల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిన వీసా ప్రక్రియ

మన దేశం నుంచి ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీకి విద్యార్థులు వెళ్తుంటారు. ఇవే కాకుండా వైద్య విద్య కోసం చైనా, ఫిలిప్పైన్స్, రష్యాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రవేశాలు పొందాలనుకునేవారు సాధారణంగా జూన్​లో వీసా ప్రయత్నాలు మొదలు పెడతారు. ప్రస్తుతం ప్రధాన దేశాలన్నీ వీసా ప్రక్రియను నిలిపివేశాయి. ఎప్పుడు ప్రారంభిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు-సెప్టెంబర్​లో వెళ్లటం సాధ్యం కాకపోవచ్చు. విదేశీ విద్యార్థులు రావొచ్చని న్యూజిలాండ్... దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ప్రకటించింది. కెనడా కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఆన్​లైన్ ద్వారా ఇక్కడి నుంచే చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ప్రాన్స్ కూడా త్వరలోనే విదేశీ విద్యార్థులను అనుమతించే అవకాశం ఉంది. వివిధ దేశాలు విద్యార్థులు రావొచ్చని చెప్పినప్పటికీ... విమాన ప్రయాణం, ఆర్థిక అంశాలు ఇబ్బందికరంగా మారాయి.

ఇదీ చూడండి: వర్మ ఇంతటి నీచానికి దిగజారతారనుకోలేదు : అమృత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.