మూసీలో కొట్టుకుపోయిన వ్యక్తి
భారీ వర్షాలు భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు నగరం అతలాకుతలమైంది. పాతబస్తీ బహదూర్‌పురాలో ఓ వ్యక్తి మూసీ ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు భయానక పరిస్థితిని సూచిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అడవిలో అలజడి
కొంతకాలంగా ఏజెన్సీల్లో అలజడి కొనసాగుతోంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా మంగపేట అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భర్త వేధింపులే...
తమ కూతురు, అల్లుడు బంగారు భవిష్యత్తును ఊహించుకుంటున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అడ్డుకట్టపడింది. పెళ్లైన ఆరు నెలలకే కన్నవారికి ఆమె కడుపుకోతను మిగిల్చింది. ఈ ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటర్ టాక్సీలు ప్రారంభం
కేరళవాసుల కోసం అక్కడి ప్రభుత్వం.. మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. తొలిసారిగా 'వాటర్ టాక్సీ' సేవలను ప్రారంభించింది. కాటమరాన్ పడవలతో ఈ సేవలను అందిస్తోంది ఆ రాష్ట్ర జల రవాణా శాఖ. అలప్పుజ రేవులో ఈ పడవలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చివరి దశకు కరోనా!
కరోనా జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కొవిడ్ ప్రత్యేక కమిటీ తెలిపింది. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే దిశగా వెళ్తోందని.. తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతేనే లాక్‌డౌన్ విధించాలని పేర్కొంది. బహిరంగంగా గుంపులుగా చేరడం కారణంగా వైరస్ వ్యాప్తి జరుగుతుందని నిరూపించడానికి కేరళలో నిర్వహించిన ఓనం పండగ ఓ ఉదాహరణగా కమిటీ చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
22 మంది జవాన్లు మృతి
సెంట్రల్ వియత్నాంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 22మంది సైనికాధికారులు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పాక్- గ్రే లిస్ట్‌లోనే కొనసాగింపు
ఉగ్రవాద కార్యకలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్న పాక్.. ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21-23 మధ్య జరిగే సమావేశంలో పాక్ విషయంలో ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జియో నుంచి సంచలనం
అత్యంత తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని రిలయన్స్ జియో యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశం 5జీ వైపు అడుగులు వేస్తున్నవేళ.. ఇంకా 2జీ నెట్వర్క్ వాడుతున్న వారే ప్రధాన లక్ష్యంగా రూ.5 వేల లోపే 5జీ ఫోన్ విక్రయించాలని జియో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తెవాతియా క్యాచ్‌కు ముగ్ధుడైన వీరూ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆల్‌రౌండర్ తెవాతియా పట్టిన అద్భుత క్యాచ్‌కు ముగ్ధుడయ్యాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అవకాశమిస్తే కరోనా వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయగల సత్తా అతడికి ఉందని కితాబిచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నా పెళ్లి గురించి ఎందుకు?
హీరోగా, సహ నటుడిగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నవదీప్. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న ఈయన.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.