ETV Bharat / city

టాప్ టెన్ న్యూస్ @9PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్ టెన్ న్యూస్ @9PM
author img

By

Published : Nov 4, 2020, 8:59 PM IST

1. హోరాహోరీ ఫలితాలు

శతాబ్దంలో ఎరుగని విధంగా అమెరికాలో ఓటింగ్ శాతం నమోదయ్యేలా కనిపిస్తోంది. 67 శాతం మంది ఓటర్లు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగమైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పలు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కీలక రాష్ట్రంపై బైడెన్​ పట్టు

అమెరికా అధ్యక్షుడిని నిర్దేశించే అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్​లో డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​ ఆధిక్యంలోకి వెళ్లారు. మొదటి నుంచి ఇక్కడ ట్రంప్​ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. బైడెన్​ అనూహ్యంగా దూసుకెళ్లారు. దీంతో ట్రంప్​ గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ నాలుగు రాష్ట్రాలే కీలకం!

అగ్రరాజ్యంలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతున్న వేళ.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఎలక్టోరల్​ ఓట్లలో బైడెన్​ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్​నకు పట్టు ఉండటం వల్ల పరిస్థితులు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. టెక్​ హబ్​గా హైదరాబాద్

తక్కువ సమయంలో ప్రముఖ బహుళ జాతి సంస్థలను తెలంగాణ ఆకర్షించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. గత ఆరేళ్లలో భాగ్యనగరం.. దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా అవతరించిందన్నారు. నైట్​ ఫ్రాంక్​ తయారు చేసిన వర్క్​ ఫ్రమ్​ హైదరాబాద్​ రిపోర్టును విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఈఎన్సీకి లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాశారు. ఏడాది కేటాయింపుల్లో మిగులు జలాలను తదుపరి ఏడాది వినియోగించుకునే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్​కు వెళ్లవచ్చని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సన్నాలకు రూ.1888

రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సన్నాలకు రూ.1,888లకు, దొడ్డు వరి ధాన్యాన్ని రూ.1868లకు కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది వానకాలంలో వరి సాగులో సన్నరకాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించడం వల్ల రైతులంతా పెద్ద ఎత్తున ఆ వండగాల సాగు చేశారు. తీరా ధాన్యం అమ్ముకోవడానికి వస్తే సన్న రకాలకు సరైన మద్దతు ధరలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఎన్​డీఏ విజయం తథ్యం

బిహార్​ యువత, మహిళలు ఎప్పుడూ ఎన్​డీఏతోనే ఉన్నారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి మద్దతుతోనే తమ కూటమి విజయం సాధిస్తోందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు సుపరిపాలన అందించే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రెండు కోట్ల మందికి కరోనా!

కర్ణాటకలో సుమారు రెండు కోట్ల మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. రాష్ట్రంలో కొవిడ్​ కేసులు పెరుగుదలను అంచనా వేసేందుకు సెప్టెంబర్​లో ఈ సర్వే జరిపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి డాక్టర్​ సుధాకర్ తెలిపారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. జట్టులోకి హార్దిక్​ పాండ్యా

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా.. బౌలర్లు బుమ్రా, బౌల్ట్​ ఆడకపోవడంపై కెప్టెన్​ రోహిత్​శర్మ స్పష్టత ఇచ్చాడు. జట్టులో మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వడానికే వారికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. ప్లేఆఫ్​ మ్యాచ్​కు ఆ ముగ్గురు అందుబాటులో ఉంటారని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఉప్పెన నుంచి సర్​ప్రైజ్

'ఉప్పెన' సినిమాలోని మరో పాటను సూపర్​స్టార్​ మహేశ్​ బాబు విడుదల చేయనున్నారు. నవంబరు 11న సాయంత్రం ఈ పాట రిలీజ్​ కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.