ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM
author img

By

Published : Nov 3, 2020, 4:59 PM IST

1. వీఆర్వోపై మహిళా రైతుల దాడి

ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలో రెండేళ్ల కిందట జరిగిన భూ ప్రక్షాళనలో భాగంగా భూమిని రికార్డుల్లో తక్కువగా నమోదు చేసిన అప్పటి వీఆర్వోపై బాధిత రైతులు చెప్పులతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 71.10 శాతం పోలింగ్

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. చివరి గంటలో పీపీఈ కిట్లతో వచ్చిన కొవిడ్ పేషంట్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ముంపు ప్రాంతాల్లో పర్యటించాలి

హైదరాబాద్​లో వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పార్టీదో... ప్రభుత్వానిదో స్పష్టం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే నగరంలో పర్యటించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. గంగూలీ, కోహ్లీ, తమన్నాలకు నోటీసులు

ఆన్‌లైన్‌ జూదం నిషేధం కేసుపై తమిళనాడులోని మదురై బెంచ్‌ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా క్రీడా, సినీ ప్రముఖులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ జూదం సంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌, తమన్నా, రానా, సుదీప్‌లకు మదురై బెంచ్‌ నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. క్షీణించిన రైల్వే ఆదాయం

ప్యాసింజర్​ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల భారతీయ రైల్వే ఆదాయం భారీగా క్షీణించింది. గతేడాదితో పోల్చితే 90శాతం తగ్గి.. రూ. 3,322కోట్లను ఆర్జించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ట్రంప్ డాన్స్ చూశారా?

అమెరికా ఎలక్షన్​ డే సందర్భంగా తాను డ్యాన్స్​ చేసిన వీడియోను ట్వీట్​ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ట్రంప్ తన​ మద్దతుదారులను ఉత్సహపరిచేందుకు డ్యాన్స్​ చేస్తున్నట్లు కనపడుతుంది. ఈ ట్వీట్​లో ఓట్‌! ఓట్‌! ఓట్!‌ అని రాసుకొచ్చారు ట్రంప్.‌ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ట్రంప్ ​X బైడెన్​

అగ్రరాజ్యానికి అధిపతిని ఎన్నుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. ఈసారి రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ మధ్య పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ మహా సంగ్రామం.. ఎలక్షన్​ డే(నవంబర్​ 3న) రోజు రాత్రి ఫలితాలతో ముగిసేలా లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బ్యాంకింగ్ షేర్లు భళా

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 503 పాయింట్లు పెరిగి.. తిరిగి 40 వేల మార్క్​పైకి చేరింది. నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఓ ఘట్టం ముగిసింది

ఆస్ట్రేలియా క్రికెటర్​ షేన్​ వాట్సన్​ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. తన కలను సాకారం చేయడానికి సాయపడిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కేబీసీపై వ్యతిరేకత..

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'కౌన్​ బనేగా కరోడ్​పతి'పై సోషల్​మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ షోలో హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపించగా.. నిర్వాహకులతో పాటు అమితాబ్​పై కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.