ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @3PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @3PM
author img

By

Published : Nov 3, 2020, 3:02 PM IST

1. రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే సిబ్బంది మంటలను అర్పుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 55.52 శాతం పోలింగ్

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. విద్యార్థులకు శుభవార్త

కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 27,589 మంది విద్యార్థులను గ్రేస్‌ మార్కులతో పాస్‌ చేయాలనే నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. భద్రత ఎలా కల్పిస్తారు?

ధరణి ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ చేసింది. ఆస్తుల వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించవద్దని ఆదేశించింది. వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్‌ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం... ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్ పార్టీకి ఇవ్వొద్దని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. దిల్లీలో చలి జోరు

దిల్లీలో ఉష్ణోగ్రత ఈ సీజన్​లోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మంగళవారం 10 డిగ్రీల సెల్సియస్​కు తగ్గింది. హిమాచల్​లోని శీతల ప్రాంతాలతో పోలిస్తే రాజధానిలోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు దిల్లీలో వాయు నాణ్యత సూచీ మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయింది. ఈ నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మోదీ విజయ రహస్యం...

భారత్​లోని తల్లులు, కూతుళ్లపై శ్రద్ధ కనబర్చటమే తన విజయానికి కారణమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. తుది ఘట్టానికి అధ్యక్ష పోరు

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంపే వస్తారా? లేదా బైడెన్​కు అధికారం దక్కుతుందా? ఎప్పటిలాగే మంగళవారం రాత్రే ఫలితాలు వస్తాయా? మెయిల్ ఓటింగ్ కారణంగా ఆలస్యం జరగుతుందా? అనే ప్రశ్నలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బైడెన్ కల సాకారమయ్యేనా?

అమెరికా అధ్యక్షునిగా గెలవాలనే సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం గతంలో రెండుసార్లు ఎందుకు చేజారింది? వంటి విషయాలపై సమగ్ర కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కోహ్లీ రికార్డు బద్దలు

బెంగళూరు జట్టు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్​లో ఐదు అర్ధ సెంచరీలు బాదిన వర్ధమాన క్రికెటర్​గా నిలిచాడు. దీంతో పాటే సీజన్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు(472) చేసిన మైలురాయిని అందుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సొంతూరిలో షూటింగ్

సొంత ఊరిలోనే షూటింగ్​ అయినా.. ఇంటికి వెళ్లట్లేదు నటుడు ఆయుష్మాన్​ ఖురానా. భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులనూ కలవడం లేదు. చిత్రబృందంతో పాటు హోటల్​లోనే గడుపుతున్నాడు. అందుకు కారణమేంటో తాజాగా వివరించాడు ఖురానా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.