1. ధరణికి శ్రీకారం
భూలావాదేవీల్లో నేటి నుంచి సరికొత్త శకం మొదలైంది. ఆన్లైన్ విధానంలో సత్వరమే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఏకకాలంలో జరగేలా ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదన్న కేసీఆర్... అధికారుల విచక్షణా అధికారులకు కత్తెర వేసినట్టు పేర్కొన్నారు. భూముల హద్దులు గుర్తిచేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టనున్నట్టు ప్రకటించారు. సాదాబైనాల గడువును మరో వారం పొడగించినట్టు సీఎం వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 20 రోజుల్లో...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 20 రోజుల్లో ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఓపెన్ ప్లాట్లు సహా ఆస్తుల వివరాలన్నీ నమోదు చేసుకోవాలని... అది వారికే మంచిదని సీఎం అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. హామీలు నెరవేర్చలేదు
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి మిరుదొడ్డి మండలం కూడవెల్లి, ఖాజీపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కలిసి పాల్గొన్నారు. ఈసారి సమస్యలపై ప్రశ్నించే వ్యక్తిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మీ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తా.. ఆ బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఏపీలో కరోనా కేసులెన్నంటే?
ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 16 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,14,784కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్రపంచం మొత్తానికి తెలుసు
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని భారత్ వ్యాఖ్యానించింది. వ్యతిరేకించినంత మాత్రాన నిజాలు దాయలేరని పేర్కొంది. ఇప్పటికైనా పాక్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఐరోపాలో కరోనా 2.0 భయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4,49,10,565కు చేరింది. మరణాల సంఖ్య 11,81,130కి పెరిగింది. ఐరోపాలో పలు దేశాలు కరోనా కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. దాయాది కుట్ర
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రదాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్నది తామేనని ఎట్టకేలకు పాకిస్థాన్ అంగీకరించింది. ఇన్నాళ్లూ కాదని బుకాయించిన ఇమ్రాన్ సర్కార్.. సాక్షాత్ ఆ దేశ పార్లమెంట్‌లోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. తగ్గిన పసిడి ధరలు
పసిడి, వెండి ధరలు గురువారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.121 తగ్గింది. వెండి ధర భారీగా తగ్గి.. కిలోకు రూ.61 వేల దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వైస్‌కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
టీమ్ఇండియా వైస్‌కెప్టెన్‌గా ఎంపికవుతానని తాను ముందుగా ఊహించలేదని ఓపెనర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ బాధ్యత తనకు గర్వకారణమని అభిప్రాయపడ్డాడు. దీన్ని సవాలుగా స్వీకరించి జట్టు కోసం తగిన కృషి చేస్తానని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రేపు కాజల్ వివాహం
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లిసందడి మొదలైంది. నటి కాజల్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును శుక్రవారం వివాహమాడానున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంట 'పసుపు కొట్టే వేడుక'కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.