1. ఇంకొన్ని రోజులే..
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 20 రోజుల్లో ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఓపెన్ ప్లాట్లు సహా ఆస్తుల వివరాలన్నీ నమోదు చేసుకోవాలని... అది వారికే మంచిదని సీఎం అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సంవత్సరంలోపు పూర్తి చేయాలి
సచివాలయ సముదాయ నిర్మాణ టెండరును షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. రూ.494 కోట్లకు టెండర్ పిలువగా 4 శాతం ఎక్కువగా కోట్ చేసి టెండర్ ప్రక్రియలో ఎల్-1 గా నిలిచింది. ఈ మేరకు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు ఆర్ అండ్ బీ శాఖ అంగీకార పత్రం ఇచ్చింది. అయితే 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్‌లో ప్రభుత్వ షరతు విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. బొగ్గు గనిలో ప్రమాదం
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ప్రమాదం చోటుచేసుకుంది. అర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి వద్ద భూగర్భ బొగ్గుగనిలో జంక్షన్ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరొకరు గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. భాజపాకైనా ఓటేస్తాం
బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు భాజపాకు ఓటు వేయడానికి వెనుకాడమన్నారు. పార్టీకి షాక్ ఇచ్చిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జలాశయాలకు కొత్త కళ
కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే పదేళ్లలో 736 డ్యామ్‌ల మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.10,211 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దాయాది కుట్ర
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రదాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్నది తామేనని ఎట్టకేలకు పాకిస్థాన్ అంగీకరించింది. ఇన్నాళ్లూ కాదని బుకాయించిన ఇమ్రాన్ సర్కార్.. సాక్షాత్ ఆ దేశ పార్లమెంట్‌లోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020 ఆ దేశ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ సంస్థ నివేదించింది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది రెండింతలు అని స్పష్టం చేసింది. ఇందులో డెమొక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బిడ్ల దాఖలుకు మరింత గడువు!
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి మరోసారి గడువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30తో ప్రస్తుత గడువు ముగియనున్న నేపథ్యంలో.. మరోసారి గడువు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అప్పులపై కొనుగోలుదారులకు ఊరటనిచ్చే కోణంలో ఈ నిర్ణయం ఉండనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కోహ్లీ ఫైర్ బ్రాండ్..
ఈ మధ్యే జరిపిన ఓ సర్వేలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా స్టార్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీ నిలిచారు. మహీ ఒదిగిఉండే వ్యక్తిత్వం కలవాడని.. కోహ్లీ భయమెరుగని అందమైన వ్యక్తి అని ఈ నివేదిక పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. లక్ష్మీ బాంబ్ టైటిల్ మార్పు
అక్షయ్ కుమార్ కొత్త సినిమా టైటిల్లో మార్పు చేస్తూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. 'లక్ష్మి' పేరుతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.