1. అడవుల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది
"పోయిన అడవిని తిరిగి తెచ్చుకోవాలంటే మనం మేల్కోవాలి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుంటే పక్కింటి వారు వచ్చి చేస్తారా? అడవుల పునరుద్ధరణకు అమెరికావారో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారో వచ్చి ఏమైనా సాయం చేస్తారా? ఈ పని ఫారెస్టు వాళ్లదని అనుకుంటే... మన బతుకు అడవి అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం.. ప్రభుత్వం చెప్పినా ఫీ'జులుం'
కరోనా ఒకవైపు ఆర్థిక పరిస్థితుల్ని తారుమారు చేసినా...తల్లిదండ్రులపై పలు ప్రైవేట్ పాఠశాలల ఫీ‘జులుం’ ఆగడంలేదు. ట్యూషన్ ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం జీవో ఇచ్చినా...యాజమాన్యాలు రకరకాల పేర్లతో అధికంగా గుంజుతూనే ఉన్నాయి. అనేక ఇంటర్నేషనల్ పాఠశాలలు 10-15 శాతం పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. రుసుములు ఎలా చెల్లించాలంటూ పలు పాఠశాలల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నా యంత్రాంగం కదలడం లేదు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. రూపుదిద్దుకుంటున్న కల్నల్ సంతోష్‌బాబు విగ్రహం
చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్ సంతోష్‌బాబు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆయన గౌరవార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. నేనుండగానే ఇంకో పెళ్లా..!
ఏడాది క్రితం తనను పెళ్లి చేసుకుని.. అదనపు కట్నం కోసం రెండో వివాహానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. సంవత్సరం అయినా తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. పుల్వామాలో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపొరాలోని త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల చేతిలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. పెట్రో బాదుడు @20వ రోజు..
దేశంలో వరుసగా 20వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం 21 పైసలు పెరిగి రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ ధర లీటర్‌పై దాదాపు 17 పైసలు పెరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. ఆసీస్-కివీస్‌లో ఫిఫా 2023 మహిళల ప్రపంచకప్
2023 మహిళా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ విషయాన్ని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం
జీ-7 కూటమిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా ఆలస్యంగా సెప్టెంబర్‌లో జరగనున్న సంపన్న దేశాల సమాహారంలో భారత్‌కు ఆహ్వానం దక్కడం విస్తృత స్థాయి చర్చలకు దారితీస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్
ఈ ఫొటో చూడగానే కంప్యూటర్ గ్రాఫిక్స్ అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకుంటే ఈ లుక్ కోసం రజనీకాంత్.. ఏకంగా ముఖానికి సిల్వర్ పెయింట్ వేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.