ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్ న్యూస్ @9PM
author img

By

Published : Mar 12, 2021, 8:58 PM IST

1. 'ప్రపంచ ఆలయాల్లో యాదాద్రి'

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని పున:ప్రారంభం కోసం తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్యూలైన్ల నిర్మాణాన్ని వచ్చే నెల 15వతేదీ కల్లా పూర్తి చేయాలని గడువు విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'పోలింగ్‌కు ఏర్పాట్లు'

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'దేశభక్తిని పెంపొందించేలా మహోత్సవాలు'

హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రేవ్ పార్టీ

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కొన్ని ఫామ్​హౌస్​లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని నిర్వాహకులు రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సీట్ల లెక్కలు ఫైనల్​

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును ఆగమేఘాలపై పూర్తి చేసుకున్నాయి ప్రధాన పార్టీలు. పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సాహిత్య పురస్కారాలు

కాంగ్రెస్​ సీనియర్​ నేత, రచయిత వీరప్ప మొయిలీకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయనతో పాటు అరుంధతి సుబ్రమణియన్​ను సహా మరో 18మందికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'క్వాడ్​ దేశాలతో పనిచేసేందుకు సిద్ధం'

క్వాడ్​ దేశాల వర్చువల్​ సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడైన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాడ్​ దేశాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 65 మంది పాత్రికేయుల హత్య

2020లో ప్రపంచవ్యాప్తంగా 65 మంది పాత్రికేయులు, మీడియా ఉద్యోగులు హత్యకు గురైనట్లు పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. 2021 మార్చి నాటికి 229 మంది జైలు జీవితం గడుపుతున్నారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'ఆ మైలురాయిని చేరుకోవాలి'

నిలకడగా బ్యాటింగ్​ చేయడమే తన రహస్యమని చెబుతోంది భారత క్రికెట్​ మహిళా జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​. వ్యక్తిగత రికార్డుల కంటే ప్రపంచకప్​లో భారత్​ను విజేతగా నిలపడమే తన చేరుకోవాలనుకున్న అసలైన మైలురాయని.. 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా మీడియాతో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కంగనా​పై కేసు!

కంగనా రనౌత్, తన పుస్తకం విషయమై కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని రచయిత ఆశిష్ కౌల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.