1. 'తొలి రోజు లక్షా 91వేల మందికి టీకా'
దేశవ్యాప్తంగా శనివారం ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. తొలి రోజు లక్షా 91వేల మందికి పైగా టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వ్యాక్సినేషన్ సక్సెస్
కొవిడ్ మహమ్మరిని తుదముట్టింటేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్... తొలి రోజు విజయవంతమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ సహా ఇతర ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ట్రెండింగ్‌గా 'వ్యాక్సిన్ డ్రైవ్'
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ప్రధానిని అభినందిస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచండి'
రాష్ట్రంలో అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు వివిధ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఇన్నోవేషన్‌లో తెలంగాణ ఆదర్శం'
మహిళా స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్... గుజరాత్‌లోని ఐ-హబ్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 200 రుణ యాప్‌ల తొలగింపు
రుణ యాప్‌ల వ్యవహారంలో... గూగుల్ ప్లేస్టోర్ నుంచి సుమారు రెండు వందల యాప్‌లను తొలగించారు. రుణగ్రహీతలను వేధిస్తున్న సంస్థలకు చెందిన యాప్‌లను తొలగించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'అంకురాల అభివృద్ధికి వెయ్యి కోట్లు'
అంకుర సంస్థల స్థాపనకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని ప్రధాని నరేంద్ర పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్-ప్రారంభ్లో ఆయన పాల్గొన్నారు. అంకురాల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. రిపబ్లికన్లూ ఆలోచించండి: బైడెన్
క్యాపిటల్ అల్లర్ల సందర్భంగా మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రిపబ్లికన్లపై బైడెన్ మండిపడ్డారు. పరిణతితో ఆలోచించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఒకే బౌలర్ చేతిలో ఆరోసారి
రోహిత్ శర్మను ఔట్ చేసిన లైయన్.. టెస్టుల్లో రికార్డు నెలకొల్పాడు. అత్యధికంగా అతడిని ఆరుసార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'మాస్టర్' మాస్ కలెక్షన్లు
దళపతి విజయ్ 'మాస్టర్' కలెక్షన్ల సాధిస్తూ దూసుకెళ్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ.50 కోట్లపైగా సాధించి.. రూ.100 కోట్లవైపు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.