ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9AM NEWS
టాప్​టెన్ న్యూస్ @9AM
author img

By

Published : Nov 16, 2020, 8:59 AM IST

1. కొత్త కేసులు 502..

రాష్ట్రంలో కొత్తగా 502 కరోనా కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,57,876 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,407 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కార్తిక శోభ

తెలుగు నెలల్లో అత్యంత మహిమాన్వితమైన మాసం కార్తికం. ఈ నెలలో హరిహరాదులను స్తుతించడంతోపాటూ చేసే ఇతర పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుందని అంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ముహూర్తం కుదిరింది​

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సరళతరం కానున్నాయి. ఇకపై డాక్యుమెంట్​ రైటర్లతో పనిలేదు. రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే ఆస్తిదారుడి పేరు మార్పు వెనువెంటనే జరిగిపోతుంది. నూతన విధానం ధరణి ద్వారా అయిదు నుంచి పది నిముషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నేటినుంచే టీఎస్ ‌బీపాస్ ‌

పట్టణ ప్రాంతాల్లో భవననిర్మాణం, లే అవుట్ల సత్వర అనుమతుల కోసం నేటి నుంచి టీఎస్​-బీపాస్‌ అమలులోకి రానుంది. బీపాస్‌ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. నేడు ఎమ్మెల్సీల ప్రమాణం

రాష్ట్రంలో నేడు కొత్త ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషీయో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. నాలుగోసారి నితీశ్

జేడీయూ అధినేత నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి ఉప ముఖ్యమంత్రిగా సుశీల్‌ మోదీ లేకుండానే ఆయన ప్రమాణం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. తెరుచుకున్న శబరిమల ఆలయం

వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది. ఇవాళ్టి నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆర్‌సెప్‌ ఒప్పందం ఖరారు

ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందంగా భావిస్తున్న ఆర్​సెప్​ ఓ కొలిక్కి వచ్చింది. అతిపెద్ద వాణిజ్య ఒడంబడికపై 15 ఆసియా-పసిఫిక్‌ దేశాలు సంతకాలు చేశాయి. ఎనిమిదేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. ఒప్పందం ద్వారా చైనాకే ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ప్రైవేట్​ అకాడమీలకు చేయూత

రానున్న నాలుగేళ్లలో 500 ప్రైవేటు అకాడమీలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక ప్రోత్సాహం అందించనుంది. దేశవ్యాప్తంగా మారుమూలనున్న ప్రతిభను వెలికితీయడానికే అకాడమీలకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. చరణ్​కు అభిమానట!

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​కు తాను పెద్ద అభిమానినని అంటోంది 'ఉప్పెన' ఫేమ్​ కృతి శెట్టి. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టకముందే చెర్రీ నటించిన ప్రతి సినిమాను వదలకుండా చూసేదాన్నని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.