1. గీతం నిర్మాణాలు కూల్చివేత
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద కొన్ని కట్టడాలను.. రెవిన్యూ సిబ్బంది అధికారులు తొలగించారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధానద్వారం, ప్రహరీగోడను రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారు. జేసీబీ, బుల్డోజర్లతో అర్ధరాత్రి నుంచి కూల్చివేత మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సర్కారు బడిలో ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ
పాఠశాల విద్యకు సంబంధించి కొత్త విద్యా విధానంలో మొత్తం 294 అంశాలపై మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. పూర్వ ప్రాథమిక విద్య, సిలబస్ మార్పు, 3-18 సంవత్సరాల వరకు నిర్బంధ ఉచిత విద్య, పరీక్షల్లో సంస్కరణలు తదితర వాటిని ఎప్పటిలోపు అమలు చేయాలో కేంద్రం ఇప్పటికే గడువు నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు
మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. గోదావరి ప్రాజెక్టులతో 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని.. కృష్ణా ప్రాజెక్టులతో మిగిలిన జిల్లాలు సుభిక్షమవుతాయని తెలిపారు. వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'మక్కలు కొంటున్నాం'
వానాకాలంలో పండించిన మొక్కజొన్న పంటను కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే క్వింటాలుకు1850 రూపాయల మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఓకే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరిలో నీటి వాటాను తేల్చేందుకు గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందుకోసం తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి కోరారు. ఈ విషయంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్
జాతీయ జెండాపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి భాజపా, కాంగ్రెస్. కశ్మీర్ ప్రత్యేక జెండా తమ చేతికి వచ్చాకే.. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేస్తామనటం.. దేశ ద్రోహమే అవుతుందని పేర్కొంది భాజపా. ముఫ్తీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారత రా అధికారితో ఓలి భేటీపై విమర్శలు
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిపై అధికార, విపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓలి.. భారత నిఘా సంస్థ అధికారి సామంత్ కుమార్‌తో అపారదర్శకంగా భేటీ నిర్వహించిన నేపథ్యంలో.. దౌత్యపరమైన విషయాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'డేటా భద్రత కోసం ఫేస్బుక్ ఖర్చు ?'
సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ప్రతినిధి అంకి దాస్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆ సంస్థ ఆదాయం, పన్ను చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిటీ. తమ ఆదాయంలో.. దేశ ప్రజల వ్యక్తిగత డేటా భద్రత, గోప్యత కోసం ఏ మేరకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సీఎస్కేకు కలిసి రాలేదు: ధోని
ముంబయితో పోరులో ఘోరంగా విఫలమయ్యామని సీఎస్కే కెప్టెన్ ధోని అన్నాడు. ఈ ఓటమి తనకు బాధకలిగించిందని తెలిపాడు. ఈ ఏడాది తమ జట్టుకు కలిసి రాలేదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మల్లిక చిందేస్తే అదరహో!
ఐటమ్ సాంగ్స్‌తో ఊపేసి.. అందాలతో అదరగొట్టి.. సెక్స్ సింబల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి.. మల్లికా శెరావత్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో తన నటనతో.. అందంతో ఆకట్టుకున్న మల్లిక పుట్టినరోజు నేడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.