1. కొత్తగా 1,421 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,421 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో కొవిడ్ బాధితుల సంఖ్య 2,29,001కు చేరింది. ఇప్పటివరకు 1,298 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!
మరో రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసుల ఆర్టీసీ చర్చలు కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్షా 60వేల కిలోమీటర్లకు రూట్‌మ్యాప్‌ను తయారు చేసి తెలంగాణ ఆర్టీసీ అధికారులకు ఏపీ అధికారులు పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నష్టం రూ.9,422 కోట్లు
రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన రెండో రోజూ కొనసాగనుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు కొన్ని జిల్లాల్లోనూ అధికారులు పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యాక నష్టంపై అధికారుల బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ధరణి సాగేనా సాఫీగా..?
రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం చర్యలు ముమ్మరమయ్యాయి. దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభంకానున్న అంచనాల నడుమ... నమూనా లావాదేవీలు చేపడుతున్నారు. నేటి నుంచి డిజిటల్ సంతకాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొవాగ్జిన్ మూడో దశకు లైన్ క్లియర్
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్ టీకా' 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. త్వరలోనే ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరీక్షల ఫలితాల ఆధారంగా మూడోదశకు అనుమతిని ఇచ్చిందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. వన్నె తెచ్చిన పత్రిక
ప్రముఖ గీతాప్రెస్ ప్రచురించే ఓ పత్రిక.. ధర్మం, భక్తి, జ్ఞానం వంటి ఎన్నో కథలకు ప్రతీతి. ఆ పత్రిక ప్రారంభమై దాదాపు 92 సంవత్సరాలు అయింది. ఇంతకీ ఆ పత్రిక పేరేంటి?. దానికి ఎందుకంత ఆదరణ లభించింది?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. వైఫల్యం వల్లే కేసులు పెరిగాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య రెండో సంవాదం ఆసక్తికరంగా సాగింది. చర్చలో భాగంగా కరోనా అంశంపై చర్చ రసవత్తరంగా జరిగింది. అయితే ట్రంప్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయగా.. బైడెన్ విమర్శల దాడికి దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మళ్లీ పబ్‌జీ !
భారత్‌లో నిషేధం విధించిన గేమింగ్ యాప్ పబ్‌జీ మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్ సంస్థ.. భారత్‌లో నియామకాలు చేపట్టేందుకు లింక్డ్ఇన్లో ఈ నెల 20న కొన్ని ఉద్యోగాలను పోస్ట్ చేసింది. టెన్సెంట్ పేరిట కాకుండా, క్రాఫన్ పేరుతో పోస్ట్ చేయడంతో.. ఆ గేమింగ్ యాప్ తిరిగి భారత్‌లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టీమిండియాకు అనుమతి
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో క్వారంటైన్ కాలంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు భారత జట్టుకు న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. టాలీవుడ్ డార్లింగ్
డార్లింగ్ ప్రభాస్.. 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.