1. వర్షాలకు 13 మంది మృతి
కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏకధాటిగా వాన కురుస్తుండటం ప్రళయాన్ని తలపిస్తోంది. రాష్ట్ర రాజధానిలో ఈ రాత్రి కాళరాత్రిలా మారింది. చాలా కాలనీలు నీట మునిగాయి. రహదారులపై వరద పోటెత్తడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. అక్టోబరు నెలలో ఈస్థాయి వర్షపాతం గత వందేళ్లలో ఇదే రెండో అత్యధిక వర్షపాతమని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో మరో 1,446 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,446 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 2,16,238కి చేరాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా కీసర రూ.కోటీ 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. చంచల్‌గూడ జైలులో నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హిమాయత్‌సాగర్ 14 గేట్లు ఎత్తివేత
వర్ష బీభత్సానికి హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్ట్‌లోకి 17200 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 14 గేట్లు ఎత్తి 17150 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కూచిపూడి కళాకారిణి శోభానాయుడు మృతి
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. బిహార్ బరి: బడా నేతలు, భారీ ప్రచారాలు మిస్!
రసవత్తరంగా సాగే బిహార్ ఎన్నికలు.. భారీ ప్రచారాలకు, బడా నేతల హవాకు వేదికగా నిలుస్తాయి. హోరాహోరీగా సాగే పోరాటంలో... పార్టీలు ప్రచార జోరుతో ఆకట్టుకుంటాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో వేడి పుట్టిస్తారు నేతలు. కానీ ఇప్పుడవేవీ బిహార్ ఎన్నికల్లో కానరావట్లేదు. కరోనా సంక్షోభంలో జరుగుతున్న ఎన్నికల్లో.. ప్రచారం పరిమితంగా సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. కీలక రాష్ట్రాల్లో బైడెన్ పైచేయి
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యంలోని విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా తెలిసింది. ట్రంప్, బైడెన్ మధ్య 10 పాయింట్ల వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. '20 ఏళ్లలో 40 లక్షల ఆల్టో విక్రయాలు'
మారుతీ సుజుకీ ఆల్టో మోడల్ కారును విడుదల చేసి 20 ఏళ్లు పూర్తయింది. ఈ రెండు దశాబ్దాల్లో సుమారు 40 లక్షలకు పైగా కార్లు విక్రయించినట్లు తెలిపింది ఆ సంస్థ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. గాయంతో పంత్ మ్యాచ్‌లకు దూరం
దిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడికి తొడ కండరాల్లో గ్రేడ్-1 చీలిక ఏర్పడినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో లలిత్ యాదవ్‌కు వికెట్‌కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని దిల్లీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. కాబోయే భర్త పోస్ట్‌కు కాజల్ కామెంట్
అగ్ర కథానాయిక కాజల్ తనకు కాబోయే భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా పోస్ట్‌కు చేసిన కామెంట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మొదటి సారి కాజల్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు గౌతమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.