1. జీఎస్టీపై.. ఇవాళ నిర్ణయం
జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి జీఎస్టీ మండలి రాష్ట్రాల ముందుంచిన రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఉన్నతస్థాయి సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రభుత్వ ఐసీయూకు తాకిడి
గత నెలరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 21 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య దాదాపు 23 శాతానికి పైగా తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సందడిగా మారిన ట్యాంక్‌బండ్
గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఓటర్ల జాబితా
లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఒకే ఓటర్ల జాబితాను ఖరారు చేసే దిశగా భాజపా సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారు తాజాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్రతి రోజూ పళ్లెంలో
కరోనా కాలంలో శరీరంలో తగినంత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. శరీరం ఎంత దృఢంగా ఉంటే.. కొవిడ్ లాంటి వ్యాధులను అంత సులువుగా జయించవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. భారత సీక్రెట్ ఆపరేషన్
గల్వాన్ లోయలో తన సైన్యంపై జరిగిన దాడి తర్వాత భారత్.. చైనాకు అనూహ్య రీతిలో షాకిచ్చింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఫ్రాన్స్ సహకారం
ప్రతిష్ఠాత్మక మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ కోసం ఫ్రాన్స్‌తో కీలక చర్చలు జరుపుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ముగియనున్న మారటోరియం
బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకుని కొవిడ్ ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన వారిని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన మారటోరియం ఇవాళ్టితో ముగియనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. హామిల్టన్ ఖాతాలో మరో టైటిల్
ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ బెల్జియన్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్లో 89వ టైటిల్ సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మహాను'బాపు'డు
తెలుగు సినీ పరిశ్రమలో కుంచెతో బొమ్మలు వేసి.. వాటి ఆధారంగా అద్భుతమైన చిత్రాలు తీసి.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు బాపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.